మోడల్ స్కూల్ విద్యార్థులకు వృత్తి విద్య శిక్షణ

మోడల్ స్కూల్ విద్యార్థులకు వృత్తి విద్య శిక్షణ

ప్రిన్సిపాల్ సయ్యద్ అబ్దుర్ రఫి

బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: వృత్తి విద్యపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అబ్దుర్ రఫి తెలిపారు. ఇంటర్నెట్ షిప్
టెన్త్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ బ్యూటీ అండ్ వెల్నెస్ ఐటీ రంగాలలో 12 రోజులు పాటు శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.ఇందుకోసం మోడల్ స్కూల్ విద్యార్థినులకు నంద్యాల లోని కరీనా బ్యూటీ స్పా అండ్ సలూన్ ,శ్రీ సాయి బ్యూటీ పార్లర్ లో , బండి ఆత్మకూరు లోని సి వి డిజిటల్ స్టూడియో, మీసేవ కేంద్రంలో ఇంటర్న్షిప్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాఫి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నంద్యాల లోని కరీనా బ్యూటీ స్పా అండ్ సెలూన్ ని బాలికల సంరక్షణ జిల్లా అధికారిని నాగ సువర్చల , ప్రిన్సిపల్ రాఫి సందర్శించి బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రాక్టికల్స్ ని అక్కడ ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి ఇంటర్నెట్ షిప్ చేస్తున్న విద్యార్థులతో సంభాషించారు. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాల స్థాయి నుండి వృత్తి విద్యా శిక్షణ వలన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ ప్రోగ్రాం వృత్తి విద్య అధ్యాపకుడు అయిన మదన్ షావలి  బ్యూటీ అండ్ వెల్నెస్ అధ్యాపకురాలు, భవ్య పర్యవేక్షణలో జరుగుతుందని ప్రిన్సిపల్ రాఫి తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!