జొన్నగిరి పోలీసు స్టేషన్ ను వార్షీక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
నేరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలి
పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన … జిల్లా ఎస్పీ
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి:జొన్నగిరి పోలీసు స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు శుక్రవారం వార్షీక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్, ఎక్సైజ్ కేసులను సమీక్షించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలన్నారు.పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య , ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు ప్రసాద్, గుణశేఖర్ బాబు, పులిశేఖర్, జొన్నగిరి ఎస్సై జయశేఖర్ ఉన్నారు.