జమ్మలమడుగు ఆర్డిఓ సాయి శ్రీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

జమ్మలమడుగు ఆర్డిఓ సాయి శ్రీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

దళితులను చిన్నచూపు చూస్తున్న ఆర్డీవోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమ్మానుయేల్

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే కడప జిల్లా జమ్మలమడుగు డివిజన్ రెవెన్యూ అధికారి ఆదిమూలం సాయి శ్రీ  దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. భారతదేశంలో రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ అలాగే ఎస్సీ కమిషన్ ఈ రెండు ప్రాముఖ్యమైనవి. వాటి మీద ఒక రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షునిగా రామాజీ ఇమ్మానియేల్ అను నేను నేడు 21.10.2024 వ తేదీన ఉదయం 11:00 గంటలకు గౌరవ ఆర్డిఓ సాయి శ్రీ గారిని మా సమస్యలపై కలిసినప్పుడు మా ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండ ఒక సీనియర్ అయిన నన్ను నాతోటి నాయకులను కార్యాలయంలో ఉన్నంతవరకు దాదాపు 10 నుంచి 20 నిమిషాల వరకు కూర్చోమని చెప్పకుండా కుల వివక్షత చూపిస్తూ నిలబెట్టి మాతో మాట్లాడడం జరిగింది.
ఈ విషయంపై శుక్రవారం ఉదయం 10 గంటలకు 25.10.2024 వ తేదిన జమ్మలమడుగు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన కార్యక్రమం మరియు మాకు జరిగిన కుల వివక్షత అన్యాయంపై, మా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వైకరిస్తున్న రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆదిమూలం సాయి శ్రీ గారు అనుసరించిన వైఖరికి వ్యతిరేకంగా కార్యక్రమం తలపెట్టనున్నాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం దళితుల పట్ల గాని దళితులు ఇచ్చిన ఫిర్యాదిపట్ల గాని నిర్లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తే చట్ట ప్రకారం వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్ 4 నమోదు చేయాలని చట్టం చెప్పుచున్నది. అయితే ఇంతవరకు ఇలాంటి చట్టాలు ఉన్నతాధికారులు అమలు చేయలేదు. తక్షణమే నేడు 21.10.2024 వ తేదీన రెవెన్యూ కార్యాలయంలో స్పందన (గ్రీవెన్స్ సెల్) వీడియో లైవ్ ను పై అధికారులు పరిశీలించి వాటి ఆధారంగా రెవెన్యూ అధికారి ఆదిమూలం సాయి శ్రీ పైన SC ST అట్రాసిటీ కేసు సెక్షన్ 4 నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టడమైనది. అని ఆయన తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!