భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామ సభ

భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామ సభ

హోళగుంద, న్యూస్ వెలుగు: రైతులకు చెందిన భూములను రీ సర్వే చేశారని వాటిలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తహసిల్దార్ సతీష్ కుమార్ పేర్కొన్నారు.మంగళవారం మండల పరిధిలోని హోన్నూరు,హోన్నూరు క్యాంపు గ్రామాల్లో భూ రీ సర్వే సమస్యలపై గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 2023లో రైతుల భూములను భూ రీ సర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.అయితే భూ రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్ నిజాముద్దీన్, రి సర్వే తాసిల్దార్ ముకుందరావు విఆర్ఓలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!