పార్టీ సభ్యత్వంతో ప్రతి కార్యకర్త కు ఆర్థిక భరోసా
జొన్నగిరి గ్రామంలో ముమ్మరంగా టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుతో ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు.ఈ సందర్భంగా మంగళవారం రోజున పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శాంబాబు ఆదేశాల మేరకు జొన్నగిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందుచూపుతో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మరియు కార్యకర్తల సంక్షేమం కొరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని వారు తెలియజేశారు.ప్రతి కార్యకర్త వంద రూపాయల సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక భరోసాను కల్పిస్తుందని వారు తెలియజేశారు.కావున 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓబులేసు,టిడిపి సీనియర్ నాయకుడు బాలన్న,విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవి,మాజీ ఎంపీపీ గురు స్వామి,లక్ష్మణ స్వామి, తుగ్గలి మాజీ ఎంపీటీసీ వల్లే వెంకటేష్, కిష్టయ్య,తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.