
చెన్నంపల్లి గ్రామ నీటి సంఘం అధ్యక్షునిగా గోపాల్ రెడ్డే అర్హుడు
మెజార్టీ వర్గాలకు దగ్గరగా గోపాల్ రెడ్డి
నీటి సంఘం ఎన్నికల్లో గోపాల్ రెడ్డిదే గెలుపంటున్న గ్రామ ప్రజలు.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామ నీటి సంఘం అధ్యక్షునిగా గోపాల్ రెడ్డి మాత్రమే అర్హుడని,త్వరలో రాష్ట్రంలో నిర్వహించే నీటి సంఘాల ఎన్నికలలో భాగంగా తుగ్గలి మండలంలోని చెన్నంపల్లి నీటి సంఘం అధ్యక్షునిగా గోపాల్ రెడ్డి గెలుపొందడం ఖాయమని చెన్నంపల్లి గ్రామస్తులు తెలియజేస్తున్నారు.గోపాల్ రెడ్డి కు చెన్నంపల్లి నీటి సంఘం పరిధిలోని మెజార్టీ వర్గాలు గోపాల్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని ప్రజలు తెలియజేస్తున్నారు. గోపాల్ రెడ్డి చెన్నంపల్లి గ్రామంలో జరిగే ఉత్సవాలు గాని గ్రామంలో ఏర్పడే ఏ సమస్యలకైనా సహాయ సహకారాలు అందిస్తూ దగ్గరుండి ముందుకు నడిపించే వాడని, గ్రామంలోని చెరువులో ఐదు సంవత్సరాలు తూములో నీళ్లు పారకుండా సమస్య ఉంటే అనుభవం ఉన్న వేరే గ్రామ మనసులను ఆయనే స్వయంగా పిలిపించి 25000 ఖర్చుపెట్టి రిపేర్ చేయించిన ఘనత ఆయనకే దక్కిందని అందుకే ఆయన అందరివాడు అందరి మద్దతు ఆయనకే ఉందని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.చెన్నంపల్లి చెరువు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని,ఆ సమస్యలకు సంబంధించిన ఎంత ఖర్చైనా ప్రజల కోసం స్వతహాగా ఖర్చుపెట్టి సమస్యలను పరిష్కారం చేయగలడని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.