రహదారికి అడ్డంగా ఉన్న రాళ్ళు,బండలు తొలగించండి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఊరి వాకిలి వద్ద నిర్మించే డ్రైనేజీ నిర్మాణం పనులో భాగంగా రహదారికి అడ్డంగా ఉన్న రాళ్ల బండలు,కంకర రాళ్లు,ఇసుక,కట్టెలను సంబంధిత అధికారులు తొలగించాలని శనివారం టీడీపి సీనియర్ నాయకులు గాళి వీరభద్ర గౌడ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటకు వెళ్లేందుకు ఇది సింగల్ రోడ్డు కావడం వల్ల సదరు రహదారిలో బండరాళ్లు,కంకర రాళ్లు,ఇసుక అడ్డంగా ఉండడంతో రాకపోకలకు వాహనదారులకు తీవ్ర కష్టంగా ఉందని కావున ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు రహదారికి అడ్డంగా ఉన్నవాటిని తొలగించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!