కార్మిక ,కర్షక వ్యతిరేకి మోడీ ప్రభుత్వం

కార్మిక ,కర్షక వ్యతిరేకి మోడీ ప్రభుత్వం

న్యూస్ వెలుగు, కర్నూలు; కార్మికులకు కర్షకులకు వ్యతిరేకమైన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని మోడీ ప్రజా వ్యతిరేకమైన విధానాలకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ఇచ్చిన పిలుపులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి ఎం.డి అంజిబాబు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గఫూర్ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నదని విమర్శించారు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్ లను తీసుకుని వచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధానాలు అనుసరిస్తుందని అన్నారు పెట్టుబడుదారులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చిందని తెలియజేశారు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని కానీ కార్మికులకు మాత్రం పుట్టగొడుతుందని విమర్శించారు 375 రోజులు కొనసాగిన రైతు ఉద్యమం సందర్భంగా నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు అందుకనే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు రైతు సంఘం రాష్ట్ర నాయకులు జగన్నాథం రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు నష్టదాయకమైన విధానాలు అనుసరిస్తుందని తెలియజేశారు కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు రామాంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ ఏఐపికేఎస్ నాయకులు నాయకులు మల్లికార్జున టి యు సి ఐ నాయకులు తిరుపాలు ఐ ఎన్ టి సి నాయకులు సుంకన్నతదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు న్యూ సిటీ అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు సాయిబాబా ఓల్డ్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ దేశాయ్ విజయ్ సిఐటియు నాయకులు రాముడు రాజశేఖర్ ఏఐటీయూసీ నగర్ కార్యదర్శి చంద్రశేఖర్ నగర అధ్యక్షులు వెంకటేష్ నగరనాయకులు రామకృష్ణారెడ్డి గూడూరు సిఐటియు నాయకుడు మోహన్ కల్లూరు సిఐటియు మండల కార్యదర్శి మధు కర్నూలు మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు గోపాల్ రైతు సంఘం నాయకులు ఆంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్ సీనియర్ జిల్లా అధ్యక్షురాలు రేణుకమ్మ నగర నాయకురాలు బాలదుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!