బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిరావు పూలే
న్యూస్ వెలుగు, కర్నూలు; ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూల్ న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో వీరనారి ఐలమ్మ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 132వ వర్ధంతి ని అధ్యక్షుడు రాముడు అధ్యక్షతన జరిగింది,ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి.గురుశేఖర్ మాట్లాడుతూ అంటరానితనాన్ని ఎండగట్టి, సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవ హక్కులకై ఉద్యమించిన సామాజిక విప్లవకారుడు, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికై పాటుపడిన ఆదర్శప్రాయుడు, సమా సమాజ స్థాపనలో భావి తరాలకు నిత్య స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు పూలే అని కొని ఆడారు ఫుల్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని వారు అన్నారు.సేవలను స్మరించుకుంటూ, ఘన నివాళులు అర్పించడం జరిగింది. న్యూ సిటీ అధ్యక్ష కార్యదర్శులు సి.రాముడు, సి.శేషాద్రి, ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు నగర కమిటీ సభ్యులు మద్దిలేటి, ఎల్లయ్య, కర్రన్న, వీరేష్, నెట్టికంటయ్య, చందు, చంద్రన్న, పకీరప్ప,తదితరులు పాల్గొన్నారు