
ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాo
హొళగుంద, న్యూస్ వెలుగు; సివిల్ రైట్స్ డే సందర్భంగా, పై అధికారుల ఆదేశాల మేరకు SI బాల నరసింహులు శనివారం ఎల్లార్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది, పిల్లలకు చదువు యొక్క అవశ్యకత గురించి తెలియజేయడం జరిగినది, బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదనీ, అలా ఎవరైనా బాల్యవివాహాలు చేయడానికి ప్రయత్నిస్తే వారి తల్లిదండ్రుల పైన సహకారం అందించే వ్యక్తులపైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. బాల్య వివాహల వలన జరిగే అనర్థాలను వివరించడం జరిగినది. SC, ST లకు చట్టపరంగా ఉన్న హక్కుల గురించి, అవకాశాల గురించి తెలియజేస్తూ వారి యొక్క బాధ్యతలను కూడా గుర్తు చేయడమైనది. వారికి గల హక్కులను, చట్టాలను చట్ట ప్రకారం ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమమునకు హోలగుంద పోలీస్ స్టేషన్ SI బాల నరసింహులు , హోలగుంద డిప్యూటీ తహసిల్దార్ నజీర్ అహ్మద్ , ఎల్లార్తి VRO ప్రహల్లాద గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.