బోనాల పండుగ

బోనాల పండుగ

శీర్షిక: బోనాల పండుగ

పూనకం పట్టిన స్త్రీలు,
తలపై బోనం మోస్తూ,

డప్పుగాళ్ళ మోతలకు,
అనుగుణంగా నర్తిస్తూ,

ఏటా సాగే పండుగ,
మన బోనాల పండుగ.

కాకతీయుల నుండే ఆరంభమైన,
ఆడ పడుచుల పండుగ,
మన బోనాల పండుగ.

కాలికి గజ్జె కట్టిన పోతురాజు తోడ,
సామాన్యులు చిందేయు పండగ,
మన బోనాల పండుగ.

ఒంటిపై పసుపును అద్ది,
నుదుటి పై కుంకుమ దిద్ది,

కాలికి అందెలు కట్టి,
గావు పెట్టు పండుగ,
మన బోనాల పండుగ

జానపద శైలిలో,
అమ్మవారి కీర్తనలతో,

మైకుసెట్ల హోరుతో,
జోరుగా సాగు పండుగ,
మన బోనాల పండుగ.

                                       ✍️దుంపాల వీరేష

Author

Was this helpful?

Thanks for your feedback!