FlatNews Buy Now
కోర్టు వివాదాల్లో ఉన్న.. రికార్డుల మార్పు..! కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు

కోర్టు వివాదాల్లో ఉన్న.. రికార్డుల మార్పు..! కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు

కర్నూలు ( న్యూస్ వెలుగు ) మర్చి 23:

ఒక అధికారి తప్పిదమా లేదా నిర్లక్ష్యమా విధి నిర్వహణలో ఒక చిన్న తప్పిదం వల్ల ఆయా కుటుంబాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయనేది అక్షరాల వాస్తవమని అది అనుభవిస్తే గాని చాలామందికి తెలియదని బాధితులు మంగలి చిన్న ఆంజనేయ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం తుగ్గలి గ్రామానికి చెందిన గ్రామ విఆర్ఓ, ఆర్ ఐ, తహసిల్దార్ ల తప్పిదంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులను భూములను కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికార దాహంతో, డబ్బే ప్రధానంగా చేసుకొని పనిచేసే అధికారులు సైతం లెక్కలేనంతమంది ఉన్నారనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పొచ్చన్నారు. తుగ్గలి మండలం తుగ్గలి గ్రామం అప్పటి తుగ్గలి విఆర్ఓ నాగేంద్ర నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబంలోని నలుగురు కుమారులు ఉంటే అందులో ఒకరికి మాత్రమే వత్తాసు పలుకుతూ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సర్వేనెంబర్ 92/బి1, 5.20 సెంట్లు భూమిని, 94/2- 0. 33 సెంట్ల భూమిన 2014 లో కోర్టు వివాదాల్లో ఉంది. మంగళ నాగంజినేయులు తండ్రి హనుమంతు మధ్య ఉన్న హద్దుల సమస్యపై 2014లో కోర్టులో వివాదం జరుగుతుండగా.. ఇంతలో 2009 నుంచి 2019 వరకు మంగలి నారాయణమ్మ, భర్త నారాయణ పేరుపై రికార్డుల్లో నమోదయి… వివాదాస్పదంగా ఉన్న పరిస్థితుల్లో 2019లో మంగలి నారాయణమ్మ మృతి చెందడంతో సర్వేనెంబర్ 92 బి1 లోని 5. 20 సెంట్లు భూమిని, 94/2 లోని 0.33 సెంట్లు భూమిని తన భర్త నారాయణ మీదుగా తదనంతరం నారాయణమ్మ పై రికార్డుల్లో ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే నారాయణమ్మ నవంబర్ 20 2019 న 59 సంవత్సరాల వయసులో నారాయణమ్మ మృతి చెందినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. నారాయణమ్మకు మొత్తం ఆరుగురు సంతానం. ఇందులో ఇద్దరు కూతుర్లు కాగా మిగిలిన నలుగురు కుమారులుగా ఉన్నారు. మంగలి నారాయణమ్మ ఐదవ సంతానమైన మంగళి మేఘన్న మిగిలిన ఐదుగురుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మదింపు వీలునామా తనకు రాసిచ్చారన్న కారణంతోనే ఈ భూమి బధలాయింపు జరిగిందని, అప్పటి తుగ్గలి గ్రామ విఆర్ఓగా పనిచేసిన నాగేంద్ర ను ” న్యూస్ ఎట్ నౌ ” ప్రతినిధి వివరణ కోరగా సమాధానం ఇచ్చారు. ఇదే రిపోర్టుని ఆర్ఐ సుధాకర్ రెడ్డికి తాసిల్దార్ కి కూడా రిపోర్టులను అందించినట్లు తెలిపారు.

కోర్టు పరిధిలోని వివాద పరిష్కారం అయిన తదుపరి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వీఆర్వో నాగేంద్ర తెలిపారు. ఇంత జరుగుతున్న అప్పటి తుగ్గలి తహసిల్దార్ ఎలాంటి విచారణ చేయకుండా గుడ్డిగా కుటుంబంలోని మిగతా వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంగలి మేఘన్నకు ఎలా భూమిని బదలాయిస్తారని అప్పటి తహసిల్దార్ వెంకటలక్ష్మి సహా.. ఈ భూమి బదలాయింపులోని అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు మంగలి చిన్న ఆంజనేయ కర్నూలు కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. మార్చి 23 సోమవారం పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి బాధితులు మంగలి చిన్న ఆంజనేయులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ పత్తికొండ ఆర్డిఓ, తుగ్గలి ఎమ్మార్వో వివరణ ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులు ఆదేశించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS