జనసేన పార్టీ సభ్యత్వలను నమోదు చేసుకోండి

జనసేన పార్టీ సభ్యత్వలను నమోదు చేసుకోండి

జనసేన పార్టీ కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం పిలుపు

డోన్, న్యూస్ వెలుగు;  నంద్యాల జిల్లా డోన్ జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జనసేన క్రియాశీలక సభ్యత్వ సమన్వయకర్త పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ జనసేన ఉద్యమి సభ్యత్వ ల కార్యక్రమం ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 దాకా కొనసాగుతుందని కావున ప్రతి ఒక్క జనసేన కార్యకర్త జనసేన ఉద్యమ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. డోన్ నియోజకవర్గం లో అత్యధికంగా జనసేన సభ్యత్వాలు నమోదు అయ్యేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి చేశారని జనసేన పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని కావున జనసేన బలోపేతానికి జనసైనికులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS