డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో విలీనం చేయాలి

డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో విలీనం చేయాలి

బేడ బుడగ జంగాలను ఎస్సి జాబితాలో చేర్చాలి

ఎస్సి, ఎస్టీ,బిసి స్టూడెంట్ మేనేజమెంట్ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలి

ఎస్సి అంబేద్కర్ గురుకుల (బాయ్స్ )పాఠశాలకు సొంతభవనాలు ఏర్పాటు చేయాలి

జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి

ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటు డి పట్టా కలిగిన రైతులకు అన్నదాత సుఖీ భవ నిధులు విడుదల చేయాలి

డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి

కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి

డోన్, న్యూస్ వెలుగు; 
డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతానని ఇచ్చిన సి ఎమ్ హామీని నెరవేర్చుకోవాలని, డోన్ నుంచి నంద్యాల జిల్లాకు పోవాలంటే ఎక్కువ వ్యయ ప్రయాసలకు

గురికావాల్సి వస్తుందని, కావున డోన్ నియోజకవర్గాన్ని కర్నూల్ జిల్లాలో కలపాలని,
రాష్ట్ర వ్యాపితంగా బేడ బుడగ జంగాలను ఎస్సి జాబితాలో చేర్చి వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎస్సి సర్టిఫికెట్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సి, ఎస్టీ,బిసి స్టూడెంట్ మేనేజమెంట్ హాస్టల్స్ కు సొంత భవనాలు లేక చాలా దూరములో ఉండి పాములు, దొంగల నుంచి ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అదేవిదంగా ఎస్సి అంబేద్కర్ గురుకుల (బాయ్స్ )పాఠశాలకు సొంతభవనాలు లేక స్టేడియంలో తరగతులు, హాస్టల్స్ నిర్వహించడం దారుణమైన పరిస్థితి ఉందని, మరియు తమరు జలదుర్గం గ్రామములో మీటింగ్ లోజలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తాను అని ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఈ నంద్యాల జిల్లాలో చాలా మంది పేద రైతులు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటు డి పట్టా, పాస్ బుక్ లు కలిగిన రైతులకు అన్నదాత సుఖీ భవ నిధులు రావడం లేదని
తమరు ఇచ్చిన మరొక హామీ డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తాను అని హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమములో జిల్లా స్పోక్స్ పర్సన్ ఎమ్. జయరాం, లీగల్ సెల్ అధ్యక్షులు జీవన్,డిసిసి ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, డిసిసి కార్యదర్శులు గోపి నాథరావ్, పి. శివరాముడు,మధు సూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగన్న, డోన్ పట్టణ అధ్యక్షులు శేఖర్,బేతంచెర్ల మండల అధ్యక్షులు డి. రామాంజనేయులు,ప్యాపీలి మండల అధ్యక్షులు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS