కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలి : రైతు సంఘం

కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలి : రైతు సంఘం

కర్నూలు న్యూస్ వెలుగు : కౌలు రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగనాథం  మరియు కౌలు రైతు సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు చెప్పిన విధంగా కౌలు రైతు చట్టాన్ని తక్షణమే తీసుకొని వచ్చి గ్రామ సభల ద్వారా అసలైన కౌలు రైతులకు గుర్తించి భూ యజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఏప్రిల్ నెల నుంచే యాడ్ చేయాలని అదేవిధంగా భూమి యజమానితో సంబంధం లేకుండా పంట హామీపై కవులు రైతుకు రెండు లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందించాలని ఆ దిశగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతి కౌలు రైతుకు వర్తింపజేయాలని కౌలు రైతు సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రైతు కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ప్రెషన్ చెల్లించాలన్నారు. ప్రతి కౌలు రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డులు కిషన్ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి సి మహేష్, తుగ్గిలి మండలం రైతు నాయకులు నరసింహులు కల్లూరు మండలం రైతు సంఘం మండల కార్యదర్శి బి బి రాముడు, , పుల్లన్న,బి సుంకులు, భాష,ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS