
ఆర్టీసీ బస్సుపై పడ్డ కరెంటు పోల్ ..విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు )మార్చి 18 : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో గల కుందూ నది బ్రిడ్జి ముందర ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్లే ఆర్టీసీ బస్సు బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పక్కలో ఉన్న సపోర్ట్ తీగకు తగలడంతో విద్యుత్ స్తంభం విరిగి ఆర్టీసీ బస్సు మీద పడింది. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ లేకపోవడంతో బస్సులో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ కంబగిరి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి చర్యలు చేపట్టారు.
Was this helpful?
Thanks for your feedback!

