పట్టపగలే గ్రీన్ అంబాసిడర్ ఇంట్లో చోరీ

పట్టపగలే గ్రీన్ అంబాసిడర్ ఇంట్లో చోరీ

నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ) మార్చి 18 : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం గ్రీన్ అంబాసిడర్ గా పనిచేస్తున్న యం. శ్రీనివాసులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం బర్రెల కోసం గడ్డి తీసుకురావడానికి వెళ్లగా 11 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు తెలిపారు. బీరువా తాళాలు పగలగొట్టి రెండు తులాలు బంగారు, లక్ష రూపాయలు దొంగిలించినట్లు తెలిపారు. వెంటనే బండి ఆత్మకూరు ఎస్ఐ కు ఫిర్యాదు చేసినట్లు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS