
కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
కర్నూలు ( న్యూస్ వెలుగు ) మర్చి 21: భరత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు లో భాగంగా ఈనెల 24వ తారీఖు రెండు సెంట్ల ఇంటి జాగా ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందర జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో పోస్టల్ విడుదల చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే జగన్నాథం సిపిఐ నగర కార్యదర్శి పి రామక్రిష్ణా రెడ్డి నగర సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు సి మహేష్ నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు, కిట్టు, సి.కుమార్ నగర మహిళా నాయకురాలు ధనలక్ష్మి, సులోచనమ్మ రామాంజి, ప్రసాదు,శివ,శీను సుధాకర్ పోస్టర్ విడుదల చేసిన వారిలో ఉన్నారు జగన్నాథం,రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 24వ తారీఖు రాష్ట్రవ్యాప్తంగా ఇంటి స్థలం లేని ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని పట్టణ ప్రాంతంలోని పేదలకు రెండు సెంట్లు ఇంటి జాగా ఇవ్వాలని ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ రుణం ఇవ్వాలని ఇంటి స్థలం ఇవ్వలేని పక్షంలో బాడుగ ఇండ్లలో ఉన్నటువంటి పేదలందరికీ ఐదు వేల రూపాయలు ఇంటి అద్దె చెల్లించాలని కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇవ్వాలని జీవో నెంబర్ 24 రద్దు చేయాలని టీడుకో గృహాలు తక్షణమే పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలని పలు డిమాండ్ల పైన ఈ నెల 24వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉన్నది ఇంటి జాగా లేని ప్రతి పేదవాడు ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

