విద్యార్థులకు క్రీడలతోనే ఆరోగ్యకర జీవనం – బ్రహ్మానంద చారి

విద్యార్థులకు క్రీడలతోనే ఆరోగ్యకర జీవనం – బ్రహ్మానంద చారి

విద్యార్థులకు క్రీడలతోనే ఆరోగ్యకర జీవనం – బ్రహ్మానంద చారి

 

నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ) మార్చి 17 : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో క్రీడలు విశిష్టత పై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. మొదట బ్రహ్మానంద చారి హెచ్ఎం నాగేంద్రప్రసాద్ క్రీడల పోటీలను ప్రారంభించడం జరిగినది. అవగాహన సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. క్రీడలతోనే ఆరోగ్యకర జీవనమని, మానసిక ఉల్లాసాన్ని క్రీడలు ఎంతో తోడ్పాటు అందిస్తాయని క్రీడాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని, మంచి క్రీడాకారులకు విద్యలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాయని క్రీడలు విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు. డీపీపీ పాఠశాల హెచ్ఎం నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఉర్దూ పాఠశాల హెచ్ఎం ఆలియా కథిన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిపియుపి పాఠశాల హెచ్ఎం నాగేంద్ర ప్రసాద్, ఉర్దూ పాఠశాల హెచ్ఎం అలియా కథిన్, ఉపాధ్యాయులు నాగేంద్రుడు, పుష్పరాజు , ఎన్ కోబరావు, మొదలవారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS