FlatNews Buy Now
హెచ్ఐవి/ఎయిడ్స్  సుఖ వ్యాధులపై అవగాహన సదస్సు

హెచ్ఐవి/ఎయిడ్స్  సుఖ వ్యాధులపై అవగాహన సదస్సు

న్యూస్ వెలుగు – పత్తికొండ:  యువతీ యువకులు సుఖ వ్యాధుల పట్ల జాగ్రత్త ఉండాలి అని సి ఎల్ డబ్లు శివరాముడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్.ఐ.వి వ్యాధి పట్ల యువతకు అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని, చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు.
హెచ్.ఐ.వి కేవలం అసురక్షిత లైంగిక సంబంధాలు , హెచ్.ఐ.వి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవితో కలుషితమైన సూదులు సిరంజీలు, పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అదేవిదంగా,హెచ్.ఐ.వి. ఉంది అని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని, మందులు వాడుతూ, వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు అని తెలియచేసారు. హెచ్.ఐ.వి. ఉందనే కారణంతో వివక్ష చూపకూడదు అని, అది హెచ్.ఐ.వి./ ఎయిడ్స్ చట్టం – 2017 ప్రకారం శిక్షార్హమైన నేరమని తెలియచేసారు.
హెచ్.ఐ.వి. పట్ల ఎటువంటి సందేహాలు/ అనుమానాలు ఉన్నా జాతీయ హెల్ప్ లైన్ 1097 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలియచేసారు. కండోమ్ బాక్సు గురించి మరియు ఇతర ఇబ్బందులు గురించి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని గ్రామాల్లో అవగహన సదస్సులు మరియు సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యముగా యువత, మహిళలు, పొదుపు సంఘాలు, కార్మికులు , గ్రామ ప్రజలను భాగస్వాములు చెయ్యాలి అని చేప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో , హెడ్మాస్టర్ కృష్ణమూర్తి టీచర్స్, పాండురంగడు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS