FlatNews Buy Now
పి జి ఆర్ ఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులను తప్పుదారి పట్టిస్తున్న అధికారులు

పి జి ఆర్ ఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులను తప్పుదారి పట్టిస్తున్న అధికారులు

  • తాగునీటి పైప్లైన్లు లీకేజీలు.. నీరు వృధా.. పట్టించుకొని అధికారులు
  • పి జి ఆర్ ఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులను తప్పుదారి పట్టిస్తున్న అధికారులు

నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ) మార్చి 17 : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల కేంద్రంలో కుళాయి నీటి పైపుల లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరారు. మండల కేంద్రంలో మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద, జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర రెండు చోట్ల గత నెల రోజుల నుండి కుళాయి నీటి పైపు లీకై నీరు వృధాగా పోతున్నాయి. నీరు వృధాగా పోతూ బురద మయంగా మారుతుందని, పూర్తిస్థాయిగా వివర్స్ కాలనీలో నీరు రావడంలేదని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ కాలేజీ, జిల్లా పరిషత్ హై స్కూల్ కు ప్రధాన రహదారి కావడంతో పదవ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ విషయంపై మండల అధికారులకు తెలియజేసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ పైప్లైన్ లీకేజ్ ని అరికట్టకుండా ఫిర్యాదు చేసిన బాధితుడికి సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు తప్పుడు నివేదికలు అందజేశారని, పిజిఆర్ఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించకుండానే తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కులాయి పైపు లీకులను అరికట్టి నీరు వృధా కాకుండా అరికట్టాలని గ్రామ ప్రజలు కోరారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS