శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి శ్రావణ మాస పూజలు
ఆలూరు : హోళగుంద మండల పరిధిలో దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవాలయంల్లో శ్రావణ మాస మొదటి ఆదివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.అలాగే అర్చకులు పంపన్న ,మహేష్ ఉదయం నుంచి స్వామివారి సన్నిధిలో జలాభిషేకం,బిల్వార్చన,పంచామృతాభిషేకం,బిల్వార్చన,ఆకుపూజ,దేవుడిని పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు.అమ్మవారనికి దర్శించుకుందేకు మహిళ భక్తులు ప్రతి మెట్టుకు కుంకుమ బండారు అంటిస్తూ గిరి పైకి చేరుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!