గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రేసులో సుఖవాసి శ్రీనివాసరావు ..

గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రేసులో సుఖవాసి శ్రీనివాసరావు ..

న్యూస్ వెలుగు గుంటూరు :  పార్టీకి అంకితభావంతో పనిచేసిన నేతకు కీలక బాధ్యత అప్పగించే యోచనలో టిడిపి అధిష్టానం . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల కమిటీల పునర్నియామక ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా గుర్తింపు పొందిన గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని టిడిపి అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందనే ఉత్కంఠ గుంటూరు జిల్లా రాజకీయాల్లో కొనసాగుతోంది. ఈ పదవిపై పలువురు ఆసక్తి చూపుతున్నప్పటికీ, పార్టీ నిబద్ధతకు నిలువెత్తు ప్రతీకగా నిలిచిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు పేరు చైర్మన్ పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది.

సంక్షోభ సమయంలో పార్టీకి అండగా

సుఖవాసి శ్రీనివాసరావు పేరు వినిపించడం వెనుక ఆయన పార్టీ కోసం చేసిన త్యాగాలు, సేవలు ప్రధాన కారణం. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో టీడీపీకి ఎదురైన ఒడిదుడుకులు, నిర్బంధాలను ధైర్యంగా ఎదుర్కొని సుఖవాసి పూర్తిస్థాయిలో పార్టీ పక్షాన నిలిచారు. కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా, పార్టీ సిద్ధాంతాలను సాధించడంలో ముందుండి నాయకత్వం వహించారు. ముఖ్యంగా, నియోజకవర్గాల స్థాయిలో అబ్జర్వర్ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు.

రాజకీయాలలో కోడెల శివప్రసాద్ శిష్యునిగా

మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్‌కు ముఖ్య అనుచరుడిగా సుఖవాసి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఈ నేపథ్యంతో, ఆయనకు చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ అంతర్గతంగానే కాకుండా , కార్యకర్తల్లోనూ గట్టిగా వినిపిస్తోంది.

అధిష్టానం వైపు నుండి గ్రీన్ సిగ్నల్ !

గుంటూరు జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల దృష్టికి సుఖవాసి శ్రీనివాసరావు పేరును తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు, సమస్యల పరిష్కారంలో వ్యవహరించిన తీరు పట్ల అధిష్టానం సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ పదవిని ఇస్తే పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసేవారికి అధిష్టానం పెద్దపీఠ వేస్తుందన్న నమ్మకం క్రింది స్థాయి పార్టీ వర్గాల్లో కలిగించినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీకి కష్టకాలంలో ట్రబుల్ షూటర్ సుఖవాసి

ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో సుఖవాసి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సందర్భాల్లో ఆయన చాకచక్యంగా వ్యవహరించి, సమస్యలను పరిష్కరించగలిగారు. ఈ నేపథ్యంతో అధిష్టానం ఆయనను ‘ట్రబుల్ షూటర్’గా పరిగణిస్తుంది. పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన సందర్భంలో కూడా వారి మధ్య పొరపచ్చాలు తొలగించడంలో సుఖవాసి కీలక పాత్ర పోషించారన్న గుర్తింపు ఉంది.

మరో వారం రోజులలో తుది నిర్ణయం?

పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ వారంలో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా నేతల అభిప్రాయాలు అధిష్టానం సేకరించినట్లు తెలుస్తోంది.. వీరిలో ఎక్కువమంది సుఖవాసి శ్రీనివాసరావు పేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి సూచించినట్లు తెలిసింది.

ప్రస్తుత రాజకీయపరిణామాలు చూస్తే, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి సుఖవాసి శ్రీనివాసరావు కు ఖాయమన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా నెలకొన్నది.

Author

Was this helpful?

Thanks for your feedback!