FlatNews Buy Now
తుగ్గలి  కేజీబీవీ జూనియర్ కళాశాలలో 97 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు

తుగ్గలి  కేజీబీవీ జూనియర్ కళాశాలలో 97 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు

తుగ్గలి, న్యూస్ వెలుగు ;  మండల కేంద్రమైన తుగ్గలిలోని కేజీబీవీ జూనియర్ కళాశాల విద్యార్థినిలు బుధవారం ఉదయం విడుదలైన ఇంటర్మీడియట్ ఫైనల్

ఇయర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచారని ప్రిన్సిపాల్ షాహిన్ మధ్యాహ్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుగ్గలి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు ఈ ఫలితాల్లో హర్షిత, సంకీర్తనలు 1000లో 975 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినందున. వీరి విజయంతో కేజీబీవీకి గౌరవం పెరిగింది అని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో విద్యార్థినిలు 85 శాతం ఉత్తీర్ణులయ్యారు. బి.మైత్రి 455 మార్కులకు గాను 424 మార్కులు సాధించి టాపర్గా నిలిచిందన్నారు. విద్యార్థినుల విజయంపై ప్రిన్సిపల్ షాహిన్, ఆనందం వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS