ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Delhi (ఢిల్లీ) :ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని CJI జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురి సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది .  2004లో ఉపవర్గీకరణ చెల్లదంటూ నాటి ఐదుగురి సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది.  దీన్ని రాజకీయపరమైన అంశంగా పరిగణించరాదని సూచించింది. ఈమేరకు వర్గీకరణలో నిర్దిష్టమైన విధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వ్యాఖ్యానించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!