ఆత్మాభిమానం రాజ్యాధికారమే లక్ష్యం : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు షాలెం రాజు

ఆత్మాభిమానం రాజ్యాధికారమే లక్ష్యం : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు షాలెం రాజు

పత్తికొండ( న్యూస్ వెలుగు ) : దళితులకు ఆత్మ అభిమానం రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ పనిచేస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు షాలెం రాజు పత్తికొండ కేంద్రంగా శనివారం ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వారు ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులను ఏకతాటిపై నడిపించేందుకు బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షతన ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసి చైతన్యం చేయడం జరుగుతుందని వారు తెలిపారు . జులై 7న ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో నిర్వహిస్తున్న స్మృతి వనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ అనేక ఉద్యమాలను చేపట్టిందని ఉద్యమాలతోనే వర్గీకరణను సాధించామని వారు గుర్తు చేశారు. వర్గీకరణతో పాటు రాజ్యాధికారం కూడా దళితులకు అవసరమని వారు పేర్కొన్నారు. రాబోయే కాలంలో దళితులను రాజకీయ చైతన్యం చేసేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ 30 ఏళ్లలో వర్గీకరణ సాధించేందుకు అనేక పోరాటాలు చేశామని అయితే రాజ్యాధికారం కోసం పాటుపడలేదని వారన్నారు అయితే ఎమ్మార్పీఎస్ లో నూతన తరాన్ని రాజకీయ చైతన్యం దిశగా నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. 70 ఏళ్ల స్వాతంత్రంలో దళితులకు సమాన హక్కులు అవకాశాలు ఇప్పటికీ రాలేదన్నది వాస్తవమని వారు అన్నారు. ఇకనుంచి దళితులు ఏ పార్టీ జెండాలను మోయరని దళితుల హక్కుల కోసం రాజ్యాధికారం కోసం స్వతంత్రంగా రాజకీయాల్లో పోటీ చేసేందుకు ఎమ్మార్పీఎస్ వెన్ను దన్నుగా ఉంటుందన్నారు.

ఏబిసిడి వర్గీకరణ కోసం అనేక పార్టీలకు తమ మద్దతును తెలిపామని అయితే దళితుల ఓటు బ్యాంకు ని వాడుకున్నారే కానీ, రాజకీయ సమాన అవకాశాలు కల్పించలేదన్నారు. ఇకనుంచి ఎమ్మార్పీఎస్ ఏ పార్టీ జెండాను మోయదని ఏ పార్టీ గొడుగు కింద ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఇతర రాజకీయ పార్టీల జెండాలను మోసిన వారి పార్టీలకు వత్తాసు పలికిన ఎమ్మార్పీఎస్ సహించబోదన్నారు. దళితుల ఆత్మ అభిమానాన్ని కూడా ఇతర పార్టీ నాయకులు గౌరవించాలన్నారు. దళితుల మధ్య వర్గ విభేదాలు అంతర్గత కలహాలను సృష్టించేందుకు కొంతమంది పనిగట్టుకుని ఉన్నారని అలాంటి వాటికి ఎమ్మార్పీఎస్ తావివ్వదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ, నరసింహ, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS