దళితులపై దాడులను ఖండించిన : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ

దళితులపై దాడులను ఖండించిన : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ

పత్తికొండ ( న్యూస్ వెలుగు ): రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ ఖండించారు. పత్తికొండ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వివక్షతను పోగొట్టాలంటే విద్యతోపాటు రాజకీయ చైతన్య కూడా అవసరమని ఇకనుంచి పూర్తిస్థాయిలో ఎమ్మార్పీఎస్ పనిచేస్తుందని వారు దళితులకు హామీ ఇచ్చారు. ఏబిసిడి వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసామని అనేక కేసులను బనాయించుకుని రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు షాలేం రాజు మాదిగ పాల్గొని ఎమ్మార్పీ ఎస్ నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అన్ని జిల్లాలలో మండల కేంద్రాలలో కమిటీలను వేయడం జరుగుతుందని వారు తెలిపారు. జులై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళితులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈదిమూడి గ్రామం దళిత బిడ్డలకు ఒక పుణ్యక్షేత్రమన్నారు. బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షతన రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ చురుకుగా పని చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు షాలేం రాజు మాదిగ, జిల్లా నాయకులు గంప నరసింహులు, ఎల్లప్ప, హనుమంతు, ఫోటో రాజు, ప్రభావం న్యూస్ ఎడిటర్ సాలు రంగడు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS