వేసవికాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టండి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వెనుక ఉన్న ఫిల్టర్ బెడ్ ను పెద్దగా చేసి అదనపు ట్యాంక్ ఏర్పాటు చేయాలని సోమవారం ఎంపిపి తనయుడు ఈసా,సర్పంచ్ తనయుడు పంపాపతి,టిడిపి నాయకులు వెంకటేష్,ఆర్డబ్ల్యూఎస్ అధికారి రామ్ లీలా పరిశీలించారు.ఈ సందర్భంగా వారు ఆర్డబ్ల్యూఎస్ అధికారితో మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ ను పరిశుభ్రంగా ఉంచి వేసవి కాలంలో గ్రామంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారి రామ్ లీలా వేసవి కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వాటర్ మ్యాన్లు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!