
గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా రమేష్ గౌడ్ ఎన్నిక
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వెల్దుర్తి పట్టణానికి చెందిన రమేష్ గౌడ్ ఎన్నికయ్యారు. మంగళవారం ప్రైవేట్ హోటల్లో గ్యాస్ ఏజెన్సీ డీలర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గా మల్లికార్జున రెడ్డి , ఉపాధ్యక్షులుగా కళ్యాణ్ గోపాల్ వెంకటేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ అమర్నాథ్, ట్రెజరీ సావిత్రి, కార్యవర్గ సభ్యులు సిద్ధార్థ గౌడ్ జగదీష్ రెడ్డి కేశవ్ జితేంద్ర హర్ష రంగనాథ్ గౌడ్ తిరుమలేష్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ గ్యాస్ డీలర్స్ యొక్క సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు
Was this helpful?
Thanks for your feedback!