నేరణికి గ్రామంలో త్రాగునీటి కష్టాలు…!

నేరణికి గ్రామంలో త్రాగునీటి కష్టాలు…!

త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు.
గ్రామం వైపు కన్నెత్తి చూడని అధికారులు

హోళగుంద, న్యూస్ వెలుగు: వేసవి కాలం నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అయితే హోళగుంద మండల పరిధిలోని నేరణికి గ్రామంలో వేసవి కాలం వచ్చిందంటే ప్రజలు దాహం….దాహం….అంటూ త్రాగునీటి కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొన్ని రోజులుగా త్రాగునీటి సమస్య ఉందని గ్రామస్థులు సంబంధిత అధికారులకు తెలిపినా అధికారులు మాత్రం ప్రజల సమస్యలు తమకేమి పట్టనట్లు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్రాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుకున్నారు.

Was this helpful?

Thanks for your feedback!