ఆర్థిక సాయం అందించిన వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

ఆర్థిక సాయం అందించిన వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

Sekకర్నూలు (న్యూస్ వెలుగు): ఈ నెల 24వ తేదీన చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన బాధితులకు కావేరి ట్రావెల్స్ యాజమాన్యం రూ.40 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.

గురువారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో కావేరి ట్రావెల్స్ ప్రతినిధులు మంత్రి టి.జి భరత్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి , ఎస్పీ విక్రాంత్ పాటిల్ ,జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమక్షంలో బస్సు దుర్ఘటనలో మరణించిన మరియు గాయపడిన వారికి చెక్కు రూపంలో మంత్రికి అందజేశారు.

చిన్నటేకూరు సమీపంలో ఈ నెల 24 న జరిగిన కావేరీ బస్సు దుర్ఘటన లో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున 17 మంది పెద్దవారు , ఇద్దరు చిన్న పిల్లలు మొత్తం 19 మందికి రూ.38 లక్షలు , తీవ్రంగా గాయపడిన నలుగురు కి రూ.50 వేల చొప్పున మొత్తం 2 రెండు లక్షలు మొత్తం రూ.40 లక్షల చెక్కును అందచేశారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!