పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు

పత్తికొండ (న్యూస్ వెలుగు ): తుగ్గలి మండల పరిధిలోని గల పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల ఉప కమిషనర్ గోవింద నాయక్ గురువారం రోజున పరిశీలించారు.పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా తుగ్గలి మండలంలో గల తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను,నోవి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ను,జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించి,పాఠశాలల పరీక్ష కేంద్రంలో గల సదుపాయాలను ఆయన పరిశీలించారు.అనంతరం హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గోవింద నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని సూచించారు.పిల్లలలో ఉన్న ఇతర అలవాట్లను వదిలించుకుని పూర్తిగా పరీక్షలపై దృష్టి పెట్టేలా వారికి దిశా నిర్దేశం చేయాలని,కనీసం 90 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆగస్టీన్,రాజ మోహన్ రావు,నోవి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తిప్పయ్య, ఎగ్జామినేషన్ సీనియర్ అసిస్టెంట్ పిఎంసి ఖాన్,సీఆర్‌పీ లు ప్రసాద్, నాగేష్,వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS