
క్యాన్సర్ వ్యాది సైడ్ ఎఫెక్ట్ కు ఆదునాతన చికిత్స
కర్నూలు (న్యూస్ వెలుగ): క్యాన్సర్ వ్యాధికి అదునాతనబి చికిత్స అందుబాటులో ఉందని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్. సునీత తెలిపారు. కర్నూలు యశోద ఆసుపత్రి బ్రాంచ్ కార్యాలయంలో డాక్టర్. సునీత మీడియా సమావేశం నిర్వహించి క్యాన్సర్ వ్యాది చికిత్స విధానాన్ని వివరించారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాది ఎక్కువ మందిలో ఉందన్నారు. క్యాన్సర్ వ్యాది పూర్తిగా నయంఅయినా సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంటాయన్నారు. సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి యంఆర్ లైనక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్ లో అందుబాటులో ఉందని డాక్టర్. సునీత తెలిపారు. ఇందులో యంఆర్ఐ స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ ఒకే యంత్రం లో పని చేస్తాయని తెలిపారు. యంఆర్ లైనక్ చికిత్స సమయం చాలా తక్కువ అన్నారు. ప్రపంచంలో చాలా అరుదుగా లభించే ఈచికిత్స హైదరాబాద్ యశోద హాస్పిటల్లో లభించడం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

