పుట్టపర్తి న్యూస్ వెలుగు : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని గత ఫిబ్రవరి 25 న ముఖ్యమంత్రి చంద్రబాబు కు లేఖ ద్వారా కోరారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బాబా వేడుకలపై పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి మే 6న బాబా శత జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించేలా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరిక మేరకు ప్రభుత్వం ప్రత్యేక జీవో మంజూరు చేసింది. అదేవిధంగా ఇదే అసెంబ్లీ సమావేశాల్లోనే బాబా వేడుకల ఏర్పాట్లకు రాష్ట్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి పుట్టపర్తిలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా కోరారు. ఎమ్మెల్యే పల్లె సింధూర కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి నవంబర్ లో బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అసెంబ్లీలో ప్రజా సమస్యలతో పాటు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలపై గట్టిగా ప్రస్తావించడంతో కూటమి ప్రభుత్వం స్పందించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో శత జయంతి వేడుకలు నవంబర్ 13 నుంచి 23 వరకు అధికారికంగా ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బాబా శతజయంతి వేడుకలను నిర్వహించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు,మంత్రులు పయ్యావుల కేశవ్,అనగాని సత్యప్రసాద్,సత్యకుమార్, సవితా,కందుల దుర్గేష్,ఆనం రామనారాయణ రెడ్డి,తోపాటు బీసీ జనార్దన రెడ్డి విచ్చేశారు. అదేవిధంగా బాబా వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి , దేశ ప్రధాని నరేంద్ర మోడీ , ,మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర , ఒడిస్సా , గవర్నర్లు ఆనంది పెన్ , చంద్రశేఖర్ హెచ్ విజయ శంకర్ ,కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ ,పీయూష్ గోయల్ ,రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి లోకనాథ్ మురుగన్, తోపాటు పలు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయవాదులు ,వివి ఐ పి ,వీఐపీలు , ప్రముఖులు సచిన్ టెండూల్కర్,ఐశ్వర్య రాయ్, ఎన్వీ రమణ ,వంటి ఎందరో ప్రముఖులు విచ్చేశారు. సత్యసాయి జిల్లాలో కు గ్రామమైన పుట్టపర్తి ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. బాబా శతజయంతి వేడుకలు కనివిని రీతిలో నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయం .బాబా 100 వ జయంతి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఒప్పించి వేడుకలు కూటమి ప్రభుత్వం లో అధికారికంగా ఘనంగా నిర్వహించి ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కి సత్యసాయి బాబా భక్తులు, పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Thanks for your feedback!