
మాధురి సాహితీ బాయ్ మృతిపై విచారణ చేపట్టాలి : సిపిఐ
నంద్యాల న్యూస్ వెలుగు : బేతంచెర్ల మండలం బుగ్గాని పల్లి తండా కు చెందిన చిన్న రాముడు. ఐఏఎస్ కుమార్తె. మాధురి సాహితీ బాయ్ మృతిపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఐఏఎస్ హోదాలో ఉన్న చిన్న రాముడు వారి కుమార్తె మాధురి బుగ్గానిపల్లెకు చెందిన రాజేష్ నాయుడు అనే వ్యక్తిని ప్రేమించి ఈ ఏడాది మార్చి 7 వ తేదీన మహానంది ఆలయంలో కులాంతరవాహం చేసుకోవడం జరిగిందని మాధురి తల్లిదండ్రులు అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేయగా యువతి తల్లిదండ్రుల ఆమోదంతో బేతంచెర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది అని వారిద్దరూ అన్యోన్యంగా ఉన్న సమయంలో మాధురి తన భర్తకు ఉద్యోగం లేదని ఉద్యోగం వచ్చిన తర్వాత సంసారానికి వస్తానని పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా ఇవ్వడంతో పోలీసులు మాధురిని తన పోలీసులు మాధురిని తన తల్లి తండ్రులకు అప్ప చెప్పడం జరిగిందని తాడేపల్లి లోని తన తల్లిదండ్రుల వద్ద ఉన్న మాధురి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన బాధాకరమని వాస్తవాలను వెలికి తీయకపోతే రెండు కులాల మధ్యన అంతరాలు పెరిగే అవకాశం ఉంటుంది కావున పోలీసు అంతరాలు పెరిగే అవకాశం ఉంటుంది కావునఉన్నతాధికార్యాలు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

