వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు

కర్నూలు న్యూస్ వెలుగు:

వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై టిడిపి నేత కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మంగళవారం టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైరస్ లాంటి వాడని, ఒక చీడపురుగని ఆమె అన్నారు. ఎత్తిపోతల పథకం విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనాలోచితమైనదని ఎలాంటి అనుమతులు లేకుండా నాడు మొదలుపెట్టిన పనులను కేంద్రం అడ్డుకుందని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ద్వారానే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు బురదజల్లే ఆలోచన మానుకోవాలని ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారమే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రజలను మభ్యపెట్టి మాయలో చేసే ప్రయత్నాలు చేయొద్దని వైసీపీ శ్రేణులు ఆమె హెచ్చరించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS