
క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రజాకవి గోరేటి వెంకన్న
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు ఎమ్మార్సీ కన్వీన్షన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో APSEB SC/ST ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలండర్ ను ఆవిష్కరణ చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొని డైరీ ని ఆవిష్కరించారన్నారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం ఎలాంటి పోరాటాలనైనా ఎదుర్కొంటామని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. రాష్ట్రంలో నిబద్దతతో కూడిన ఉద్యోగ సంఘంగా పేరు ఘడించ్చిందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోలిమన్ రాజు, ఏ వీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

