
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కనీసం నిధులు కేటాయించాలి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఏపీ రైతు సంఘం కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీ ముందుధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షులుగా కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి దంభోళం శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం కర్నూలు సిపిఐ పార్టీ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు సయ్యావుల కేశన్ గారు ఫిబ్రవరి 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ రైతాంగాన్ని, ముఖ్యంగా గౌలు రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందిఅని మొత్తం రూ. 3,33 లక్షల కోట్ల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేవలం 4.31% మాత్రమే కేటాయించడం గ్రామీనుల అర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందిఅని ఈ నేపథ్యంలో
ప్రస్తుత బడ్జెట్లోని లోపాలు ఉన్నవి అని.అన్నదాత సుఖీభవ పదకానికి గతంలో రూ.9,400 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.6,600
కొట్లకు తగ్గించారుఅనికౌలు రైతుల విస్మరణ రాష్ట్రంలో మెజారిటీ భూములు సాగు చేస్తున్న కోలు రైతులు ప్రస్తావనే ఈ బడ్జెట్
లేకపోవడం గమనార్హం నామమాత్రపు కేటాయింపులు వడ్డీ రాయితీకి రూ. 2,000 కోట్లు అవసరమైతే కేవలం రూ॥ 250 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు అవసరమైతే కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారఅని
రక్షణ కవచం లేని ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం, ప్రకృతి విపత్తుల సహాయ నిధికి నిధులు సున్నాగా ఉండటంవల్ల రైతులు అభద్రతకు గురవుతున్నారు. అనుబంధ రంగాల నిర్లక్ష్యంవల్ల పశుసంవర్ధక, మత్స్య, ఆక్వా, సెరికల్చర్ వంటి ఉపాధినిచ్చే రంగాలను ఆశించిన ప్రాధాన్యత లభించలేదు.అని రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు కనీసం 10% నిరులను కేటాయించాలి. అని అలాగేగత మరియు ప్రస్తుత సంవత్సర బకాయిల కింద సుమారు రూ॥ 27,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలిఅని భూమి లేని కౌలు రైతులకు రావాల్సిన సుమారు రూ.3,500 కోట్ల బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ జమ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం కల్లూరు మండల కార్యదర్శి బి రాముడు పుల్లన్న రవియా ప్రసాదు ఇబ్రహీం నాగరాజు డప్పు మాణిక్యం మునెమ్మ రాములమ్మ పాల్గొన్నారు.

