
నిరుపేదలకు న్యాయం చేయాలని తహశీల్దార్ కు వినతి
నంద్యాల, న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సూచన మేరకు బిజెపి నాయకులు జనతా వారధి కార్యక్రమంలో భాగంగా మండల సమస్యలపై బండి ఆత్మకూర్ తహశీల్దార్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చింతా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పింఛన్లకు సంబంధించి, ఇంటి స్థలాలకు సంబంధించి, పలు సమస్యలపై పేద ప్రజలకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేసినట్లు జనతా వారధి కార్యక్రమంలో భాగంగా – ప్రజల సమస్యలకు బీజేపీ బలమైన గొంతు వినిపిస్తుందని
తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా నాయకులు బొమ్ము ధనుంజయ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు మేకల వెంకట నారాయణ , నాగరత్నం, మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

