
ఉపాధి పనికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాలు: కాంగ్రెస్
ఎన్టీఆర్ జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర నేడు NTR జిల్లాలో కొనసాగిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, కన్నెవీడు గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులు అంతా పాల్గొని,100 రోజుల పనిపై కేంద్రం చేసిన కుట్రలను వివరించారు. సగటున ప్రతి ఏడాది ఈ గ్రామంలో నెల కూడా పని కల్పించలేదని, చేసిన పనికి సైతం వేతనాలు సకాలంలో చెల్లించలేదని, కరువు పని అంటేనే పైసలివ్వరు అనే స్థాయికి పథకాన్ని దిగజార్చినట్లు శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. మన్రేగా పథకానికి, మోడీ గారు తెచ్చిన VB G- RAM G చట్టానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించి కాంగ్రెస్ చేస్తున్న ఉపాధి హామీ చట్ట పునరుద్ధరణకు మద్దతు సేకరించడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!

