
శ్రీనిధి రుణాలు జమలో రూ.2 లక్షల నిధుల అవకతవకలు..!
నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం వెలుగు కార్యాలయం శ్రీనిధి రుణాలు రికవరీ జమలో రూ.2 లక్షల నిధులు అవకతవకలు జరిగాయని ఒక వివో పరిశీలనలో బయటపడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సంబంధిత వివో తాను జమ చేసిన గ్రూపులకు కాకుండా వేరే గ్రూపులకు ఏజీఎం శ్రీనిధి నిధులను జమ చేయడం జరిగిందని తెలుసుకొని వాపోయారు. ఈ విషయంపై గురువారం సీసీ, ఎ పి ఎం, ఏజీఎం వివో ఎలు గురువారం కాన్ఫిడెన్స్ ద్వారా తమ వాదనలను చర్చల రూపంలో వాదించుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ విషయం శుక్రవారం వేలుగులోకి రావడంతో మిగతా వివోఏలు తమ శ్రీనిధి నిధులు తమ గ్రూపులకే తాము చెల్లించిన శ్రీనిధి నగదులు సక్రమంగా జమ అయినవా..! లేదా..! అని భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఎవరు సక్రమంగా శ్రీనిధి రుణాలు చెల్లిస్తారో వారి గ్రూపులకే నిధులు చెల్లించినట్లు రికార్డులను సరి చేయాల్సిన అధికారులే సక్రమంగా చేయకుంటే వారిని ఎవరు ప్రశ్నించాలి..? వివో ఏలు సక్రమంగా చూసుకోకుంటే పరిస్థితి ఆ అధికారులు చెప్పినట్లే ఉంటుందేమో అని వివోఏలు ఆందోళన చెందుతున్నారు. ఒకరి రుణాలు ఇంకొకరి ఖాతాలో జమ చేస్తే సకాలంలో రుణాలు చెల్లించేవారు వడ్డీ అధికంగా చెల్లించాల్సి వస్తుందని ఇప్పటికైనా శ్రీనిధి సంబంధించిన ప్రస్తుత ఏజీఎం స్పందించి ఇటువంటి సమస్యలను పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని శ్రీనిధి రుణాలు జమ చేసేటప్పుడు తప్పనిసరిగా వివోఏ లకు తెలిపి, రుణం చెల్లించిన వారి గ్రూపులకు మాత్రమే జమ చేయాలని వివోఏలు కోరుతున్నారు. గతంలో కూడా ఒక వివోఏ కు ఇలాగే దాదాపు ఒక లక్ష రూపాయలు జమ విషయములో అవకతవకలు జరిగినట్లు సమాచారం. మండలంలో శ్రీనిధి రుణాలు సకాలంలో మంజూరు కావడం లేదని పలువురు మహిళలు ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని శ్రీనిధి రుణాలపై సమగ్ర విచారణ చేసి, సకాలంలో శ్రీనిధి రుణాలు చెల్లించిన వారికి శ్రీనిధి రుణాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.

