పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: జగన్నాథం

పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: జగన్నాథం

కర్నూలు (న్యూస్ వెలుగు ) మర్చి 7 : రైతు పండించిన పొగాకు పంటను ఇటు కంపెనీలు కొనక అటు ప్రభుత్వము కొనుగోలు చేయక.. రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కే జగన్నాథం ప్రభుత్వంపై మండిపడ్డారు. పొగాకు సాగు చేసేందుకు ఆయా కంపెనీలు విత్తనాలు ఇవ్వగా.. చేతికి వచ్చిన పంటను కంపెనీలు కొనుగోలు చేయక రైతులను ఇబ్బందులను గురి చేస్తూ. రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక క్వింటాకు 16 వేల నుంచి 18 వేల దాకా పలుకుతున్న ధరను దళారులు రైతులను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పొగాకును మార్కెట్ కు తరలిస్తే ఆయా కంపెనీలు కొనకుండా.. నాణ్యత ప్రమాణాలను అదునుగా చేసుకొని రైతులను దళారీలు నట్టేట్ల ముంచుతున్నారని, దీనిపైన మార్కెట్ శాఖ అధికారులు కానీ రెవెన్యూ లేదా జిల్లా అధికారులు కానీ స్పందించకపోవడం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కర్నూలు,కల్లూరు కోడుమూరు,ఆలూరు,పత్తికొండ ప్రాంతాలలో పొగాకు సాగు విస్తారంగా సాగు చేసినట్లు వెల్లడించారు. పొగాకు సాగు చేసేందుకు ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చినప్పటికీ వాటి కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మార్కెట్ల నుంచి రైతులు తెచ్చిన పొగాకు పంటను తిరిగి పంపేందుకు కూడా వెనకాడలేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపైన తక్షణమే చర్యలు చేపట్టాలని పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకొని వారికి గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం కార్యదర్శి కే జగన్నాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS