
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వంచించిన కూటమి ప్రభుత్వం
కర్నూలు (న్యూస్ వెలుగు ) మర్చి 21: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మరొకసారి మోసగించిందని *ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు* విమర్శించారు. శనివారం నాడు స్థానిక సి ఆర్ భవన్ నందు నగర అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు బిసన్న తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ 2024 ఎన్నికలకు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ప్రతి మీటింగ్ లో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల 30 వేల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కుటుంబం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కసరత్తు పేరుతో కాలయాపన చేస్తూ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కేవలం 10060 పోస్ట్ లకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వీటిని కూడా ఏడాది పొడవునా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు ఈ లెక్కన 2 లక్షల 30 వేల పోస్ట్ లకి నోటిఫికేషన్ గాలికి వదిలేసినట్టేనా అని? ఆయన ప్రశ్నించారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి దాన్ని మార్చి నెలకు మార్చి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లో 3004 పోస్టులు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం డీఎస్సీ అభ్యర్థులను మోసగించడమే అన్నారు , ప్రభుత్వ శాఖల కాళీ పోస్టులే కాకుండా రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం అంకెల గారడితో మాయమాటలతో నిరుద్యోగులను మోసగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జాబ్ క్యాలెండర్ పైన ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జనవరి 30న చలో విజయవాడకు కార్యక్రమం నిర్వహిస్తే ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పత్రికల ద్వారా తెలియజేయడంతో ఎంతో ఆశతో వేలాది పోస్టులతో జాబ్ క్యాలెండర్ వస్తుందని ఎదురుచూస్తున్న నిరుద్యోగులను కేవలం10060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరొక్కసారి నిరుద్యోగులను దగా చేశారని, కనీసం 50 వేల పోస్టులతో అయినా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు
నిరుద్యోగులను మాయమాటలతో దగా చేస్తున్న కూటమి ప్రభుత్వ మెడలు వంచి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేసి ప్రస్తుతం కనీసం 50 వేల పోస్టులతో అయినా జాబ్ క్యాలెండర్ సాధించుకోవడానికి *మార్చి 25వ తేదీన ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలకు* పిలుపునివ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నగర నాయకులు అఖిల్, శివ, జస్వంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

