
మంత్రి ఇంటిని ముట్టడించిన సీపీఐ
నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు)మర్చి 24: జిల్లా కేంద్రంలో సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రంగనాయుడు తెలిపారు. నిరుపేదలైన ఇల్లు లేని వారికి నగరంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయ శాఖామంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న.. నిరుపేదలైన ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలను కేటాయించడంలోనూ, ప్రభుత్వ పథకాల అమలులోను కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వారు ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని ఇల్లు లేని నిరుపేదలైన వారికి ప్రభుత్వం స్థల కేటాయింపులు చేయకపోతే సిపిఐ ఆందోళనలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాధితులు కార్యకర్తలు ప్రజా సంఘాలు పాల్గొన్నట్లు వెల్లడించారు.

