క్షయ వ్యాధి నివారణ పై అవగాహన ర్యాలీ

క్షయ వ్యాధి నివారణ పై అవగాహన ర్యాలీ

డోన్ (న్యూస్ వెలుగు )పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డోన్ టిబి ముక్తుభారత్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశించి కీర్తిశేషులు డాక్టర్ రాబర్ట్ కోచ్ చిత్రపటానికి డాక్టర్ సల్మా కాతున్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం డాక్టర్ సల్మాకాతుమ్ మరియు డోన్ టీబీ యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అరుణ్ కుమార్ ప్రజలకు మరియు సిబ్బందికి టీబీ వ్యాధి గురించి అవగాహనను కల్పించడం జరిగింది.

తదుపరి టీబీ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది. ఈ అవగాహన కార్యక్రమాన్ని డోన్ టీబీ యూనిట్ అరుణ్ కుమార్, కరీముల్లా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్ ఫర్ టీబీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ సల్మా కాతున్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్ అరుణ్ కుమార్, కరీముల్లా, సూపర్వైజర్ వన్నూరు బాషా, ఐ సి టి సి కౌన్సిలర్ గడ్డం శేషన్న, టిబి అలర్ట్ ఇండియా ప్రతినిధులు నజీర్ అహ్మద్, రాజు, ‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ హరినాథ్, ఏఎన్ఎంలు, ఆశాలు, ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS