రైతుబజారులో దళారుల విముక్తికి చర్యలు ఎక్కడ?

రైతుబజారులో దళారుల విముక్తికి చర్యలు ఎక్కడ?

కర్నూలు న్యూస్ వెలుగు :    సి.క్యాంపు రైతు బజారు దళారుల మయమైందని దళారుల నుండి విముక్తి చేసి ఆకుకూరలు కూరగాయలు పండించే వాస్తవ రైతులకు అవకాశం కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఈరోజు కార్మిక కర్షక భవన్లోని రైతు సంఘం కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తో పాటు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ. కృష్ణ జిల్లా నాయకులు జి. ఆంజనేయులు ఈ. తాండ్రపాడు సర్పంచ్ బాలపీరా గారలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బజార్లు నెలకొల్పడం ఉద్దేశం రైతులు పండించిన కూరగాయలు ఆకుకూరలు వారే స్వయంగా అమ్ముకోవడం వల్ల మంచి రేటు వచ్చి రైతులకు ఆపదాయకంగా ఉండాలని అదేవిధంగా వినియోగదారులకు నాణ్యమైన మంచి కూరగాయలు ఆకుకూరలు లభించాలని ఉద్దేశంతో ప్రభుత్వము నాడు రైతు బజార్లను ఏర్పాటు చేస్తే అందులో రాష్ట్రంలోనే సి క్యాంప్ రైతు బజారు ప్రథమ స్థానంలో నిలిచిందని వారు తెలిపారు .అయితే రాను రాను c. క్యాంప్ రైతు బజార్లో రైతులు కాకుండా దళారుల వశమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిని అనేక సందర్భాలలో రైతులు, రైతు సంఘాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. దళారులను అక్కడి నుండి కదిలించడానికి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే వస్తుందని భయాందోళనకు గురవు తున్నట్లు వారు తెలిపారు ఫలితంగా సి క్యాంపు రైతు బజార్లో దళారులదే రాజ్యమవుతుంది తప్ప వాస్తవంగా కూరగాయలు ఆకుకూరలు పండించిన రైతులకు అవకాశం లేకుండా పోతుందని తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని దళారుల యొక్క ఆగడాలను నియంత్రించి స్వచ్ఛమైన రైతుబజారుగా నిలబెట్టేందుకు అధికారులు కృషి చేయాలని లేకపోతే మరికొంత కాలానికి దళారులు తప్ప రైతులు ఒక్కరు కూడా రైతు బజార్లో మిగలరని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పక్షంలో రైతు సంఘము ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న మండలాలలోని రైతులను సమీకరించి ఆందోళనకు పూనుకోవలసి వస్తుందని వారు హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS