
జల్దుర్గం ఎస్ఐపై డీఎస్పీకి ఫిర్యాదు
ప్యాపిలి న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జల్దుర్గం ఎస్సై అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి కి ఫిర్యాదు చేసినట్లు అఖిలభారత యాదవ సంఘం రాయలసీమ కన్వీనర్ శేష్ ఫణి యాదవ్ మీడియాకు తెలిపారు. ఊటకొండ గ్రామానికి చెందిన సురేష్ యాదవ్ పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదని వారు అన్నారు. సురేష్ యాదవ్ గొర్రెలు మేపే సమయంలో కొన్ని గొర్రెలు పొలంలో వచ్చాయాన్న ఫిర్యాదు తో.. తనను పోలీసులు దూశించడమే, కాకుండా స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవ శంకర్ యాదవ్,రమేష్ యాదవ్, సోమశేఖరు ఇతరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

