పి4 అవార్డును అందుకున్న డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు

పి4 అవార్డును అందుకున్న డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు

నంద్యాల, న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర న్యాయ & మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ల చేతుల మీదుగా సింగపూర్ నాగేశ్వరరావు తరఫున వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ ఉత్తమ మార్గదర్శి బంగారు కుటుంబం స్వర్ణాంధ్ర-2047 అవార్డును (ప్రశంసా పత్రాన్ని) అందుకోవడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సింగపూర్ దేశం నుండి డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం నుండి పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పి4 కార్యక్రమంలో భాగంగా బానకచర్ల గ్రామంలో ఎటువంటి పనిచేయలేని నిరుపేద వృద్ధ దంపతులకు ఒక గృహాన్ని నిర్మించి ఇవ్వడం ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఈ మంచి పనిని గుర్తించి అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్. టేకూరి.నాగేశ్వరావు తరపున ఆయన తల్లి అయినటువంటి టేకూరి. రామసుబ్బమ్మ ఈ సత్కారం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. నాగేశ్వరావు లాంటి గొప్ప కొడుకుకు జన్మనిచ్చినందుకు మీకు ధన్యవాదాలు తల్లి, నీ జన్మ ధన్యం అయిందని అన్నారు. సింగపూర్ టేకూరి నాగేశ్వరావు నాకు బాగా తెలుసని, ఆయనది గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని పయ్యావుల కేశవ్ సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే గొప్ప వ్యక్తి వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు ఎక్కడో సింగపూర్ నుండి కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ ఎదుగుదల కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో, అది మనమందరికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచారని ఎన్ఎండి.ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణీయా మాట్లాడుతూ.. సింగపూర్ నాగేశ్వరావు గురించి, ఆయన దేశ విదేశాలలో చేసిన అనేక సమాజసేవ కార్యక్రమాల గురించి, నేను చాలా తెలుసుకున్నానని అన్నారు. నేను వేంపెంట గ్రామ పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు తన సొంత నిధులను వెచ్చించి, అతిసార వ్యాధి ప్రబలిన సమయంలో గ్రామస్థులకు అండగా నిలబడం జరిగినదని, ఇది ఒకటే కాకుండా వికలాంగులకు దుస్తుల పంపిణీ, చనిపోయిన పేద కుటుంబాలకు సందర్శించి ఆర్థిక సహాయం అందించడం, తల్లితండ్రులు లేని పిల్లలకు చదువుకు సంబంధించి వారి అవసరాలు తీర్చడం, ఇలాగ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన గురించి చెప్పడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సేవలు మరింత చేయడానికి ముందుకు తీసుకువెళ్తామని మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా సింగపూర్ నాగేశ్వరావు మాట్లాడుతూ.. పి ఫోర్ కార్యక్రమానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్తమ మార్గదర్శిగా పేద ప్రజలకు సహాయం అందించినందుకు, ఆ సేవలను గుర్తించి మంత్రులు అధికారుల చేతుల మీదుగా ఈ పి4 అవార్డును అందుకోవడము గర్వకారణమని ఇది మరుపురాని క్షణం అన్నారు. ఈ కార్యక్రమాన్ని సింగపూర్ నుండి నేను జూమ్ మీటింగ్ ద్వారా చూడటం ఎంతో సంతోషానికి భావ ద్వేగంగా అనిపించిందని అన్నారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇంట్రాక్టివ్ కావడము మరింత ఆనందాన్ని ఎక్కడలేని సంతోషాన్ని తీసుకొచ్చాయన్నారు. ఈ సందర్భంగా నా సమాజసేవ కార్యక్రమాలను గుర్తించి నాకు అవార్డును ప్రధానం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, రాష్ట్ర మంత్రులకు, జిల్లా కలెక్టర్ కు నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. నేను నిరంతరం మా గ్రామం వేంపెంట మొదులుకొని సింగపూర్ దేశం వరకు పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ సహాయ, సహకారాలు అందించడానికి ముందుంటారని హామీ ఇచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS