అయ్యవారి కోడూరులో  ట్రాఫిక్ అంతరాయం

అయ్యవారి కోడూరులో ట్రాఫిక్ అంతరాయం

నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ తనిఖీ

కేంద్రం దగ్గర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం దాదాపు 20 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. వరి ధాన్యం లోడు లారీలు చెస్ అమౌంట్ చెల్లించడం కోసం రోడ్డుపై నిలిపివేయడంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేక ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్లక్ష్యంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు, గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS