
ఎస్టీ రిజర్వేషన్ మాయ మాటలేనా…?
వాల్మీకి ఫెడరేషన్ కు నిధులు అబద్ధాలేనా….?
బోయ వాల్మీకులను మోసం చేయడమే రాజకీయ పార్టీల నైజమా… యువతరమా ఆలోచన చేయండి
బివిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారెళ్ళ అంజి
తుగ్గలి, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా తుగ్గలి మండలం నల్లగుండ్ల గ్రామంలో సోమవారం బివిఎస్ వాల్మీకి యూత్ ముఖ్య నాయకులతో బివిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారేళ్ల అంజి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులకు స్కిల్స్ నేర్పించకుండా డిగ్రీలు పీజీలు చేసిన గ్రామాల్లోనే పొలం పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా వాల్మీకులు యువకులు ఆర్థిక స్తోమత లేక కోచింగ్ సెంటర్లు కూడా వెళ్లలేక గ్రామాల్లో , హైదరాబాదు, గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వలసలు వెళ్లి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మీకులకు ఆర్థికంగా ఎదగడానికి బోయ వాల్మీకి ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయిస్తామని బోయలను ప్రోత్సహిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిది. నేడు వాల్మీకి ఫెడరేషన్ ఉంది గాని ఫెడరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో బోయ వాల్మీకి వ్యక్తికి ఒక రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఓట్ల కోసం బోయలను వాడుకుంటారు ఎస్టీ చేస్తామంటారు ఫెడరేషన్ ద్వారా కోట్లాది రూపాయలు వాల్మీకులకు ఉపాధి కల్పిస్తామంటారు. ప్రభుత్వం ఏర్పడే రెండున్నర సంవత్సరం అవుతున్న బోయ వాల్మీకులను కూటమి ప్రభుత్వం మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతుందని ఈ మోసాన్ని వాల్మీకి యూత్ ఎప్పటికి కూడా సహించకూడదని బోయవానికి మోసం చేస్తే ఎలా ఉంటుందో రాబోతున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎలక్షన్లలో ఈ ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెప్పాలని వారు అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఫెడరేషన్ కి నిధులు మళ్లించి యువతరాన్ని ఆదుకోవాలని అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని బోయ వాల్మీకులను గతంలో మాదిరిగా మరవాలి మోసం చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బోయ వాల్మీకి యూత్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బివిఎస్ నాయకులు చిన్న కౌలుట్ల నాయుడు, రాఘవేంద్ర నాయుడు, జై చంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

